Header Banner

పాక్ నటుడికి ప్రకాష్ రాజ్ సపోర్ట్.. ఏందయ్య ఇది! దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

  Mon May 05, 2025 13:44        Entertainment

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను భారతదేశంలో నిషేధించడంపై ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఇటీవలి ఉగ్రదాడి నేపథ్యంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిస్పందనగా పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను భారత్‌లో విడుదల చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన 'అబిర్ గులాల్' అనే సినిమా విడుదలపై కూడా నిషేధం కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: పోలవరం ప్రాజెక్టుని పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం! ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్టతపై..

        

దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. "ఫవాద్ ఖాన్ సినిమాను ఇండియాలో నిషేధించడం సరైనదిగా అనిపించడం లేదు. ముందు సినిమాను విడుదల చేస్తే, ప్రేక్షకులు పాకిస్థానీ నటుల సినిమాలను ఆదరిస్తారో లేదో స్పష్టమవుతుంది. ఫలితాన్ని వారికే వదిలేయడం మంచిది" అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్న సమయంలో, పాకిస్థానీ నటుడి సినిమా విడుదల గురించి ప్రకాశ్ రాజ్ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. దేశభద్రత, ప్రజల మనోభావాల కంటే సినిమాల విడుదల ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. పాకిస్థానీ నటులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడమేంటని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices